అందాల ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి  ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది, ఇలా బాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కంగనా రనౌత్  ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఏక్ నిరంజన్ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఆ తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కంగనా రనౌత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతోంది, తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తలైవి సినిమాలో నటించింది,  ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న కూడా ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తోనే కంగనా రనౌత్  చిన్న సైజ్ యుద్ధం చేసింది, అయితే తాజాగా కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేసింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కంగనా రనౌత్ సౌత్ ఇండియా స్టార్ హీరోల‌ను ప్ర‌స్తావిస్తూ  చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే... సౌత్ ఇండియా హీరోలు అయిన య‌ష్‌ మరియు  అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా  రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు,  ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని లోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ ను యాడ్ చేశారు కంగ‌నా. ఈ పోస్ట్‌ తో పాటు.. సౌత్ కంటెంట్‌ తో పాటు సూప‌ర్ స్టార్స్‌ లో ఇంత‌లా ఆవేశం ఉండ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి... అవి ఏంటంటే...

ఈ స్టార్ హీరో లు భారతీయ సంస్కృతి లో చాలా లోతుగా పాతుకు పోయారు.

ఆ హీరోలు తమ ఫ్యామిలీ లను ప్రేమిస్తారు,  సంబంధాల విషయం లో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని వారు  నిలుపుకుంటారు.

వారి అభిరుచి,  వృత్తి నైపుణ్యం చాలా అసమానమైనది.

ఇలా కంగ‌నా ర‌నౌత్‌ రాసుకొచ్చింది, ఇక ఈ పోస్టు చివ‌రిలో బాలీవుడ్ ఇండ‌స్ట్రీ ని ప్ర‌స్తావిస్తూ కంగ‌నా ర‌నౌత్‌ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ లను చేశారు, సౌత్ హీరోల‌ను బాలీవుడ్ వారు భ్ర‌ష్టు ప‌ట్టించ‌డానికి అనుమ‌తించ‌కూడ‌దంటూ కంగ‌నా ర‌నౌత్‌ చేసిన పోస్ట్ ప్రస్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: