గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప సినిమా  మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఏపీలో పుష్ప ది రైజ్ ను కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టాలు వచ్చినా ఇతర ప్రాంతాలలో మాత్రం ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు మంచి లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.ఇక హిందీలో కూడా ఈ సినిమా అంచనాలకు మించి మంచి కలెక్షన్లను సాధించింది. అయితే తాజాగా పుష్ప సినిమా మేకర్స్ ఈ సినిమా 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.పుష్ప మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిజం లేదని ఇది పక్కా ఫేక్ అని ఫైర్ అవుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి దూరంగా ఈ సినిమా కలెక్షన్లు అనేవి ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కొందరు నిర్మాతలు కలెక్షన్ల పోస్టర్లను ప్రచారం కోసమే వేస్తామని వాస్తవంగా వచ్చిన కలెక్షన్లు తక్కువగా ఉంటాయని చెప్పిన సంగతి కూడా అందరికి తెలిసిందే.. ఇక పుష్ప ది రైజ్ సినిమాకు ప్రకటించిన కలెక్షన్ల ప్రకారమే నిర్మాతలు పన్నులు కడతారా? అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాగా ప్రశ్నిస్తున్నారు.పుష్ప ది రైజ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తే ఏపీలో టికెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఏమిటని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. పుష్ప సినిమా కలెక్షన్ల పోస్టర్ల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా పెద్ద చర్చ అనేది జరుగుతోంది. మరోవైపు పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రైజ్ మ్యాజిక్ ను పుష్ప ది రూల్ తో అల్లు అర్జున్ రిపీట్ చేస్తాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: