అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక దర్శకుడు అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తే ఇక మరో దర్శకుడు స్పందించి ప్రశంసలు కురిపించడం అటు అభిమానులందరినీ కూడా ఎంతగానో ఉత్సాహ పరుస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతోంది. ఈ క్రమం లోనే ఇటీవల రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా గురించి స్పందించిన టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
తనదైన శైలిలో డైలాగులు చెప్పారు సుకుమార్. మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలి అంటే మాత్రం పరిగెత్తాలి. మేము ఆకాశం లో ఉన్న మిమ్మల్ని చూడాలంటే మాత్రం తలెత్తాలీ. రాజమౌళి సార్ మీకు మాకు ఒకటి తేడా.. ఇలాంటి సినిమాలు మీరు తీయగలరు మేము చూడగలం అంతే అంటూ సోషల్ మీడియాలో తన అభిమానాన్ని చాటుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక పోతే ఇటీవల పుష్ప సినిమాతో సుకుమార్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి