ఆర్ ఆర్ ఆర్ లో నటించిన ఆలియా భట్ కు రన్ బీర్ కపూర్ కన్నా ముందు మొత్తం నాలుగు ప్రేమకథలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ముందుగా అలీ దదార్కర్ అనే వ్యక్తిని పేమించింది. కొంత కాలం డేటింగ్ చేసిన తరువాతః ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా వీళ్ళు తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ అపుడప్పుడు పార్టీలలో తళుక్కుమంటున్నారు. ఇక పెళ్లి అయిపోయింది కాబట్టి వీటికి అలియా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.
ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కూడా ఒకే సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తమ కెరీర్ ను స్టార్ట్ చేశారు. కానీ కపూర్ అండ్ సన్స్ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. అయితే సిద్దార్ధ్ జక్వెలిన్ తో ప్రేమగా ఉండడాన్ని తట్టుకోలేని అలియా బ్రేక్ అప్ చెప్పింది. కానీ వీరిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు.
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ తో సంచలన విజయాన్ని అందుకున్న అలియా భట్ మరియు వరుణ్ ధావన్ లు తమ ప్రేమకు బీజం వేసుకున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కావడం వలన త్వరగా కలిసిపోయారు. అయితే కొంత కలం ప్రేమించుకున్న తర్వాత వరుణ్ ధావన్ నటాషా దలాల్ ను పెళ్లి చేసుకోవడంతో వీరి రేలషన్ కు బ్రేక్ పడింది.
హైక్ మెసెంజర్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన కవిన్ మిట్టల్ ను కూడా అలియా ప్రేమించి డేటింగ్ చేసిందట. ఒక కాన్ఫరెన్స్ లో కలిసిన వీరిద్దరూ భావాలు కలవడంతో ప్రేమించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఒక రూమర్ అని తెలుస్తోంది.
అలా ఫైనల్ గా అలియా భట్ రన్ బీర్ కపూర్ ను కొంతకాలం ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి