టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఇక భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు అన్ని చోట్లా కూడా అదిరిపోయే సూపర్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లని సాధించి దుమ్ములేపింది.అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో తారక్‌ల నటవిశ్వరూపం ఇంకా జక్కన్న మార్క్ స్టోరీ టెల్లింగ్, కీరవాణి బాణీలు కలగలిసి ఈ సినిమాకు బాగా బలంగా మారాయి. దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో బాగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూసిన వారు అయితే అసలు చాలా మంది ఉన్నారు.మార్చి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బాగా షేక్ చేసింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో పలు డేట్లు కూడా వినిపించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌పై మరింత ఆసక్తి అనేది క్రియేట్ అయ్యింది.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ జీ5. ఈ సినిమాని మే 20న జీ5లో ప్రీమియం స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు అంతా కూడా ఈ సినిమా కోసం మరోసారి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా నమ్మకంతో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: