మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సర్కార్ వారి పాట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ మహేష్ కు జంటగా నటించింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ రోజున విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన లభించింది. బ్యాంకు కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు.. అందులో నుంచి డబ్బులను లోనుగా తీసుకొని ఎలా ఎగ్ కొడతారో అనే అంశాన్ని చూపించడం జరిగింది. ఈ సినిమాని ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ చిత్రం పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు.

సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కించినందుకు ముందుగా మహేష్ కు అభినందిస్తూ మంచి సందేశం ఉన్న చిత్రాన్ని చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన చిత్రం ఇది అని తెలియజేశారు సాయి రెడ్డి.పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపించే తేడా ఈ సినిమాలో బాగా ఆవిష్కరించారని విజయసాయిరెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ నుండి తెలియజేయడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

మహేష్ బాబు ఇటీవల థియేటర్ ల టికెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ని సిని సభ్యులతో కలవడం జరిగింది. ఇక టికెట్లు రేట్లు పెంచడంతో మహేష్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా సర్కార్ వారు పడ్డ చిత్రంలో జగన్ డైలాగులు కూడా పెట్టడం తో ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్ బాబు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అని తెలిపారు. అయితే ఆయన అలా కలవడం చాలా హ్యాపీగా ఉంది అని తెలియజేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: