కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవలి కాలంలో యూట్యూబ్ వేదికగా తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అంశంతో పలువురు బడాబాబుల కుమారులు, రాజకీయనాయకులు, హీరోల పై సంచలన ఆరోపణలు చేసి కొన్ని రోజుల పాటూ వార్తల్లో హెడ్ లైన్ గా నిలిచిపోయింది.


ఈ క్రమంలో మా అసోసియేషన్ శ్రీ రెడ్డి కార్డును కూడా రద్దు చేసిందట.. దాంతో శ్రీరెడ్డి తన మకాం ను చెన్నైకి మార్చిందట.ఇక అక్కడ కూడా ఈ అమ్మడు అరాచకం మొదలు పెట్టిందని తెలుస్తుంది.యూట్యూబ్ వీడియోలకు కాసులు కురుస్తూ ఉండటంతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలబ్రెటీలంతా యూట్యూబ్ పైనే ఫోకస్ చేస్తున్నారట.


ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు కూడా చేస్తోంది. సామాజిక మరియు రాజకీయ మరియు సినిమాల పై యూట్యూబ్ లో స్పందిస్తోంది.శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుందట.గత కొద్ది రోజులుగా వెరైటీ వంటకాలు చేస్తూ నానా రచ్చ చేసిందట శ్రీరెడ్డి. కోడి, చేప, మేక, పీతలు, రొయ్యలు ఇలా పలు రకాల వంటకాలు కూడా చేస్తూ నోరూరిస్తుంది. తాజాగా శ్రీ రెడ్డి పీతల కూర వండడమే కాక చాల చక్కగా ఆస్వాదిస్తుందట.. అంతేకాక ఇది తింటే మాములుగా ఉండదని ఎక్కడ పడితే అక్కడ బొక్కలలో పెట్టొద్దు అంటూ ఈ అమ్మడు నానా రచ్చ చేస్తుంది. శ్రీ రెడ్డి అరాచకం చూసి అందరు షాక్ అవుతున్నారట కాస్టింగ్ కౌచ్ అంశం పేరుతో నాని, శేఖర్ కమ్ముల తో పాటూ పలువురు సినిమా వాళ్ల పై సంచలన ఆరోపణలు చేసింది ఈ హాట్ బ్యూటీ.శ్రీరెడ్డి అంటేనే అందరికి కూడా హాట్ హాట్ గా కనిపిస్తుంది. వయ్యారాలు వడ్డిస్తూ.. సెగలు పుట్టిచేలా డ్రెస్ లు వేసుకుంటు ఉంటుంది.శ్రీరెడ్డి చీర కట్టుకున్నా కూడా అందాలు విందు చేసేలా ఉంటుంది. అటువంటి బ్యూటీ.. ఈసారి అందరికి షాక్ ఇచ్చిందట. ఈమె శ్రీరెడ్డేనా అనేలా మారిపోయిందట.. పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు కూడా అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటుంది శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: