మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా బిగ్గెస్ట్ మల్టీస్టారర్  'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి పాన్ ఇండియా సినిమాగా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకోవడంతో, తన తరువాత మూవీని కూడా చరణ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన కెరీర్‌లోని 15వ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మరోసారి శంకర్ మార్క్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు సినిమా దర్శకుడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అయితే అభిమానులను బాగా కలవర పెడుతోంది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్‌ను కూడా చాలా వేగంగా జరుపుతూ స్పీడు మీదున్నారు చిత్ర యూనిట్.అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వేసవి 2023కి మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. సినిమా డెవలెప్‌మెంట్స్‌ను బట్టి ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ నుండి అఫీషిల్ అనౌన్స్‌మెంట్ అనేది ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, ఎస్.జె.సూర్య, సురేష్ గోపీ, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్ ఇంకా అలాగే సునీల్ తదితరులు వంటి భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: