మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పాలా... ఇండస్ట్రీకే మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన కృషి, పట్టుదల, నిబద్దతతో పాటు ఎవరి ప్రోత్సాహం అయినా ఉంది అంటే అది అల్లు వారిది అని చెప్పొచ్చు. అప్పట్లో అల్లు రామలింగయ్య గారు చిరుకి అండగా నిలబడ్డారు అని అంటుంటారు. అయితే పూర్తిగా వారి వల్లే చిరు పైకొచ్చారు అనలేము కానీ ఎంతోకొంత వారి ప్రోత్సాహం అయితే ఉండేది. ఆ తరవాత బావమరిది అల్లు అరవింద్ చిరు వెంట నిలబడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించే వారిలో అల్లు అరవింద్ కూడా ఒకరు. అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంపిక చేసే విషయంలో కంటెంట్ లోని లోటుపాట్లను గుర్తించి వాటిని కథకు అనుగుణంగా బలంగా రూపు దిద్దడంలో దిట్ట.

అందుకే ఆయన నిర్మాణం లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి ఫలితాన్ని అందుకుంటాయి.  ఇదే విషయం లో భావమరిది చిరు బలంగా మారారు అల్లు అరవింద్ అని అందుకే చిరు డెప్త్ ఉన్న కంటెంట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకోగలిగింది అని అంటుంటారు. రీ ఎంట్రీ ఇచ్చాక కూడా భారీ విజయాలను అందుకున్న సమయంలో కూడా అల్లు అరవింద్ పాత్ర ఎక్కువని తెలియగా... ఈ మధ్య చిరు నుండి వస్తున్న చిత్రాల్లో నాణ్యత తగ్గుతోంది పేలవమైన కథలు తేలిపోతున్నాయి అన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇందుకు కారణం అల్లు అరవింద్ మెగాస్టార్ చిత్రాల విషయంలో దూరంగా ఉండటమే  అని అంటున్నారు. పలు విభేదాల వలన మెగా కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబం దూరంగా ఉంటోంది అని  చాలా వార్తలే వినిపించాయి.

అవి నిజమే అన్నట్లు కొత్తగా చిరు సినిమాల బాధ్యత పూర్తిగా చెర్రీ తీసుకోవడం... కొణిదెల బ్యానర్ ను స్థాపించి మేకింగ్ బాధ్యతలు చేపట్టడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే అల్లు అరవింద్ జోక్యం లేకపోవడం వలనే చిరు సినిమాలలో పస తగ్గిందని అంతా అంటున్నారు. ఇప్పటికైనా అల్లు అరవింద్ మళ్ళీ మునపటిలా శ్రద్ద చూపితే మెగాస్టార్ స్పీడ్ కు తిరుగుండదు అని ఫ్యాన్స్ అంటున్నారు. అంటే అల్లు అరవింద్ లేకపోతే చిరు లేరని కాదు ఎంత పెద్ద హీరోకు అయినా మంచి కథ పడటం చాలా ముఖ్యం... స్క్రిప్ట్ లో డెప్త్ ను ఇట్టే పట్ట గల అల్లు అరవింద్ చిరు వెంటుంటే ఆ లెక్కే వేరు అంటున్నారు మరి ఇకనైనా అందరూ ఆశిస్తున్న వార్త వినిపిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: