తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో సురేష్ బాబు కూడా ఒకరు. ఇక ఈయన ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వారసుడిగా ఆయన తండి బాధ్యతలు తీసుకొని ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద సినిమాలు ఏవి ఈయన బ్యానర్ నుంచి రాలేదని చెప్పవచ్చు.  కేవలం మీడియం రేంజ్ సినిమాలు , చిన్న సినిమాలు అలాగే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే ఆయన నుంచి తెరకెక్కుతున్నాయి. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలతోనే ఎక్కువ లాభాలను పొందుతున్నారు. ఇకపోతే సురేష్ బాబు మళ్లీ మళ్లీ అలాంటి చిత్రాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపోతే చిన్న సినిమాలకి కూడా పూర్తిగా సొంతంగా బడ్జెట్టు పెట్టకుండా తమ బ్రాండ్ వేల్యూ తో ఇతర నిర్మాతలను కూడా కలుపుకొని నిర్మించి భారీగా ప్రమోట్ చేస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.
తద్వారా 25 పైసల పెట్టుబడితో ఏకంగా రూపాయని  సొంతం చేసుకుంటున్నారు సురేష్ బాబు. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఇక ఆయనను చూసి మరి కొంతమంది కూడా చిన్న సినిమాల వైపు ఆశ పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మరొక చిన్న సినిమా కూడా తెరపై కి రానుంది.

రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ను  సినిమా ప్రదీప్ ఉప్పలపాటి తో కలిసి సురేష్ బాబు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు . నాని బండ్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు గా తెలపడానికి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది.  ఇక ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించారు నిర్మాతలు. ఇకపోతే సినిమా  లో ప్రతి ఒక్కరు కొత్తవారే అయినప్పటికీ సురేష్ బాబు బ్యానర్ నుంచి వస్తోంది కాబట్టి ఇండస్ట్రీలో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి తప్పకుండా సహాయపడుతుంది
. అంతేకాదు ఇప్పటికే నాలుగైదు సినిమాలు చిన్న అలాగే మీడియం రేంజ్ సినిమాలు సురేష్ బాబు బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి. ఇక సురేష్ బాబు చిన్న సినిమాలకు అలాగే మీడియం రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారబోతున్నాడు అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: