స్టార్ హీరో బాలయ్య నటించిన సినిమాలలో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. బాలయ్య సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ లేదంటే ఫ్లాప్ అవుతాయని ఇండస్ట్రీలో చాలామంది కూడా భావిస్తారు.


అయితే ఒకే తరహా కథలతో తెరకెక్కిన మూడు సినిమాలు బాలయ్య కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచాయట.బాలకృష్ణ హీరోగా స్వర్ణ సుబ్బారావు డైరెక్షన్ లో తెరకెక్కిన విజయేంద్ర వర్మ 2004 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన విడుదల అయింది..


ఈ సినిమాలో బాలకృష్ణ గతం మరిచిపోయిన వ్యక్తిగా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు.. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం ను సొంతం చేసుకోలేదనే విషయం తెలిసిందే. బాలకృష్ణ నటించిన సినిమాలలో మరో సినిమా అయిన లయన్ లో కూడా బాలయ్య గతం మరిచిపోయిన వ్యక్తి పాత్రలోనే కనిపించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఫ్లాప్ గా నిలిచింది.


ఆ తర్వాత బాలకృష్ణ రూలర్ అనే సినిమాలో కూడా బాలయ్య గతం మరిచిపోయిన వ్యక్తిగా కనిపిస్తారు..


సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో బాగా విఫలమైంది. గతం మరిచిపోయిన పాత్రలు బాలయ్యకు అస్సలు అచ్చిరాలేదు. ఈ సినిమాలలో ఉన్న మరో కామన్ పాయింట్ ఏంటంటే విజయేంద్ర వర్మ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా కనిపించిన బాలయ్య లయన్ లో సీబీఐ ఆఫీసర్ గా రూలర్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారట.. ఒకే తరహా కథలతో తెరకెక్కి ఫ్లాపైన బాలకృష్ణ సినిమాలైన ఈ సినిమాలు బాలయ్య అభిమానులను సైతం ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదు. సినిమాసినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండగా కథల ఎంపికలో బాలయ్య జాగ్రత్త వహిస్తే బాలయ్య తర్వాత సినిమాలు కూడా అఖండ సినిమా ను మించి విజయం ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: