ఏ ఎం రత్నం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా, దీనిని ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే దీని అనంతరం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. చాలా ఏళ్ళ విరామం తరువాత తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ గా ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారట. అలానే పక్కాగా సాగె మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రేపు రిలీజ్ తరువాత భవదీయుడు భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో షేక్ ఆడించడం చాలా వరకు ఖాయంగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి