ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభను చాటుకుని డాన్స్ మాస్టర్ లుగా మారిన వారు ఉన్నారు.  ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్స్ మాస్టర్ లుగా కొనసాగుతున్న జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్  లు కూడా ఒకప్పుడు ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారే కావడం గమనార్హం.  ఇక గత 15 సీజన్ల నుంచి ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది అని చెప్పాలి.


 అయితే ఒకప్పుడు ఢీ షో పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరికి డాన్స్ పర్ఫార్మెన్స్ లు మాత్రమే గుర్తుకు వచ్చేవి.  కానీ ఇటీవల కాలంలో డాన్స్ లతో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం  టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. అయితే మొన్నటి వరకు కేవలం తెలుగు కమెడియన్స్ మాత్రమే ఢీ లో కామెడీ పంచేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రష్యన్ అమ్మాయి ని తీసుకువచ్చి కామెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


 గత ఎపిసోడ్లో యాంకర్ నిఖిల్ తో పాటు వచ్చిన ఒక రష్యన్ అమ్మాయి తనదైన శైలిలో కామెడీ పంచింది. ఇక ఇప్పుడు ఇటీవలే విడుదలైన ప్రోమో వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో చూసుకుంటే హైపర్ ఆది కంటే ఎక్కువగా రష్యన్ అమ్మాయి పర్ఫామెన్స్ కనిపిస్తుంది.  దీంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది ఎప్పుడు మేము చూసే తెలుగు డీ షో నా లేకపోతే ఏదైనా ఇంగ్లీష్  షోనా అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. డాన్స్ రియాలిటీ షోలో ఏవేవో చేస్తున్నారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.  కాగా ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: