కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలపై మాత్రమే కాకుండా తనకు అవగాహన ఉన్న ప్రతి విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న కంగనా రనౌత్ తాజాగా ధాకడ్‌ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మే 20 తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో  విడుదలైంది. ఈ సినిమాను నిర్మాతలు దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ సినిమాకు 80 నుండి 85 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా థియేటర్ లలో  ప్రేక్షకులు ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయిన కంగనా రనౌత్ కొత్త సినిమా ధాకడ్‌ మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ధాకడ్‌ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' లో జులై 1 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ 5 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ధాకడ్‌ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: