కేజిఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్థాయిలో పేరును సంపాదించుకున్నారు. ఒక కన్నడ లోనే దాదాపుగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం. కన్నడ లోనే కాకుండా అన్ని భాషలలో కూడా కెసిఆర్ అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా కే జి ఎఫ్-2 అక్కడక్కడ థియేట్రికల్ లో ప్రసారం అవుతూ ఉన్నది. ఒకవైపు ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.


అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రం తర్వాత ఫుల్ బిజీగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటివరకు ఈమె ఏ సినిమాకి సైన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో మరొక సినిమాలు చేయబోతున్నారు. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ స్టార్ యశ్ మరియు శ్రీనిధి ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి.

హీరో యశ్ అంటే కాస్త ఆలస్యంగా సినిమా చేసిన పర్వాలేదు కానీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎందుకంత ఆలస్యం చేస్తుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేజిఎఫ్ చిత్రంలో శ్రీనిధి శెట్టి ఒక పొగరు ఉన్న అమ్మాయిల కనిపించింది. అయితే ఈమె పాత్ర విషయంలో చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఈమెకు ఆఫర్లు రాలేదు అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా కన్నడ ఈమె చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈమె కేవలం తెలుగు తమిళ హిందీ బాషల్లోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా భారీగా పారితోషకం వస్తుందని ఆశిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: