ఆంధ్రప్రదేశ్ లో మరణించిన కౌలు రైతులకు జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కౌలు రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించి మరణించిన కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి మెగా కుటుంబం సైతం తోడ్పడుతోంది. ఇటీవలి కాలంలో హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఇక వీరందరితో పాటుగా నాగబాబు పద్మజా పవన్ సోదరి మాధవి తమ ఇతర కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ జనసేన కౌలు రైతు భరోసా కు అందించారు. అయితే ఇప్పుడు పవన్ తల్లి అంజనాదేవి కూడా తన వంతు సహాయంగా రూ.1.50 లక్ష్యాలను కౌలు రైతు భరోసా కు ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాదులో పవన్ కు ఆమె విరాళం చెక్కులు అందజేసింది. తన భర్త కొణిదల వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళాన్ని ఇచ్చినట్లుగా అంజనాదేవి తెలియజేయడం జరిగింది.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారు అనే విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి ఎక్సైజ్ శాఖలో పని చేశారని ఆయన కు వచ్చిన జీతంతోనే తామంతా ఇలా పెరిగే అని తెలియజేశారు కానీ 2007లో తన తండ్రి మరణించారు అప్పటినుంచి తన తల్లి పెన్షన్ తోనే ఈ డబ్బులు దాచి సహాయ కార్యక్రమానికి ఇవ్వడం తన తల్లికి అలవాటే అని తెలియజేసారు. ఇందులో భాగంగానే ఇవ్వాల కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేకమైన నిధి విరాళంగా ఇవ్వడం జరిగింది.. తన విశాల హృదయం మైన మనసుతో చేసిన ఈ పనికి తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: