బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షారుక్ ఖాన్ నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయి నప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారానే తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించు కున్నాడు . ఇది ఇలా ఉంటే  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించి ఇప్పటికి కూడా హిందీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగు తున్నాడు .

ఇలా హిందీ పరిశ్రమ  లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ వెండి తెరపై సందడి చేసి చాలా సంవత్సరాలు అవుతుంది . వరుస అపజయాల కారణంగా కొన్ని సంవత్సరాల పాటు సినిమా లకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమా లలో నటిస్తున్నాడు . అందులో భాగంగా షారుక్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు  . ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా కనిపించబోతోం ది . 

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ...  షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కూడా నటించబోతున్నట్లు , ఈయన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలువనుందని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: