ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో కర్ణాటక ప్రాంతానికి చెందిన సినీ శెట్టి విన్నర్ గా నిలిచింది. జరిగిన 58వ సేమియా అందాల పోటీలలో పలు రాష్ట్రాల నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఇందులో 31 మంది ఫైనలిస్టులకు పోటీ పడ్డారు ఇందులో కర్ణాటక ప్రాంతానికి చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతను ప్రకటించడం జరిగింది అనంతరం ఆమె తెలంగాణ అమ్మాయి మానస వారణాసి చేతుల మీదుగా కిరీటాన్ని అందుకుంది సినీ శెట్టి.


ఈ పోటీలలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షేఖావత్ మొదటి రన్నర్ కాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన షింటా చౌహన్ కూడా సెకండ్ రన్నర్ గా నిలిచారు. ఆరు మంది న్యాయమూర్తుల ప్యానెల్ మధ్య ఈ ఏడాది ఈ పోటీలు జరిగాయి బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, నేహా దుపియా, రాహుల్ ఖన్నా, డినో మోరియా , రోహిత్ గాంధీ తదితర న్యాయ నిర్ణయాలుగా వ్యవహరించారు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు భారత మాజీ క్రికెటర్ మితాల్ రాజ్ సైతం కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం.

ఈ ఏడాది మిస్ ఇండియా ఫైనల్స్ కు ముంబైలో జియో వరల్డ్ కనెక్ట్ జరిగాయి. ఇందులో మిస్ ఇండియా 2022 కు కర్ణాటక చెందిన సినీ శెట్టి అక్కడ ఉండే వారందరి మనసును గెలుచుకొని విజేతగా నిలిచింది. సినీ శెట్టి ప్రస్తుతం చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సును చదువుతున్నది. ఈమెకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమట చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్నది. నాలుగేళ్ల వయసు నుంచి తను డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇమే ముంబైలో జన్మించింది..కానీ స్వస్థలం మాత్రం కర్ణాటక నే. ఈ వేడుకల ఎంతోమంది పాల్గొన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ విన్నర్ గా నిల్చడం తనకు చాలా సంతోషంగా ఉందని మీడియా ముఖగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: