మాస్ మహారాజా రవితేజ గురించి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . రవితేజ నటించిన సినిమా వచ్చింది అంటే ఆయన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఆయన సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు . దానితో రవితేజ నటించిన సినిమాలకు మొదటి రోజు భారీ కలెక్షన్లు కూడా లభిస్తుంటాయి . అందులో భాగంగా రవితేజ నటించిన ఆఖరి ఐదు సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు తెలుసు కుందాం .

మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ సినిమా నిన్న అనగా 29 జూలై 2022 వ తేదీన విడుదల  అయ్యింది . ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.82 కోట్ల కలెక్షన్లను సాధించింది . ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించాడు .  
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఖిలాడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది .

రవితేజ హీరో గా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల కలెక్షన్లను సాధించింది . రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.54 కోట్ల కలెక్షన్లను సాధించింది . ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు . రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.40 కోట్ల కలెక్షన్లను సాధించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: