ఇక ఏ హీరో అభిమానులకు అయినా సరే..వాళ్ళ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అది వాళ్లకి చాలా పెద్ద పండగే.ఆ రోజు వాళ్లు చేసే హంగామా మాములుగా ఉండదు. ఇక ఆ ఆనందం వాళ్ళకు మాత్రమే తెలుసు. హీరో అంటే అంత పిచ్చి అభిమానం తెలుగు జనాలకి. ఒక్క హీరో అనే కాదు ఇండస్ట్రీలో ఉండే ఆల్ మోస్ట్ అందరి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇంతే. హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు తమ పుట్టిన రోజు కన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులను కూడకట్టుకుంటారు.ఇక ఇప్పుడు కూడా అంతా ఒక్క చోట చేరారు మహేశ్ బాబు అభిమానులు. ఈ నెల 9 వ తేదీన మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు అంటే సూపర్ స్టార్ అభిమానులకు ఓ పండగ రోజు. ఎక్కడక్కడ ఉన్న ఆయన అభిమానులంతా కూడా ఒక్క చోట చేరి కేక్ కట్ చేసి ఇంకా తమకు తోచిన విధంగా పేదలకు సహాయం చేయడం ఇంకా అలాగే ఫుడ్ ప్యాకెట్స్ పంచడం చేస్తుంటారు. ఇక ఈసారి కూడా అలానే చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు.


అయితే, ఈసారి మహేశ్ అభిమానులకు అయితే షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్.ఇక ఆరోజు తన తదుపరి సినిమా కు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రీవిల్ చేయబోతున్నారట. ఇప్పుడు అసలే షూటింగ్స్ బంద్ అందులోనూ పైగా మహేశ్ బాబు అవుట్ డోర్ లో ఉన్నాడు. ఇక ఈసారి ఏం పార్టి ఉండదా..అని అనుకున్న జనాలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇండియాలో ఉన్నప్పుడే ఆయన ఫస్ట్ లుక్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకునే ఆ టూర్ కు జంప్ అయ్యాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. గత సినిమాలు కూడా అలాంటి హైప్ క్రియేట్ చేసాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని కన్ ఫామ్ చేసిన్నట్లు సమాచారం తెలుస్తుంది. మహేశ్ బాబు బర్తడే రోజున ఉదయం 9:09 నిమిషాలకు ఈ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: