కాజల్ పెళ్లి తర్వాత కొన్ని సినిమాలను చేసిన ప్రెగ్నెంట్ కావడంతో చేస్తున్న సినిమాలను వదిలేసి మధ్యలోనే వెళ్లి పోవాల్సి వచ్చింది. అయితే ఆమె మళ్ళీ సినిమాలలోకి రాదేమోనన్న భయం ప్రతి ఒక్క అభిమానిలో కూడా నెలకొంది. తాజాగా ఈమె గురించిన కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆమె ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో భారతీయుడు 2 సినిమా ద్వారా మళ్ళీ కం బ్యాక్ చేయబోతున్నట్లుగా ఆమె హింట్ ఇచ్చింది.

దీంతో తమ కలల రాణి మళ్లీ గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవడానికి సిద్ధమవుతుంది అని ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు. తెలుగులో అగ్ర కథానాయకగా పలు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోవడం కొంతమందికి నచ్చకపోయినా కూడా పర్సనల్ జీవితం దృష్ట్యా ఆమె పెళ్లి చేసుకొని ఒక పండంటి కొడుకుకి జన్మనిచ్చింది అలా కాజల్ మళ్లీ తన రియంట్రిని ఇవ్వడానికి రెడీ అవ్వడం విశేషం. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా రూపొందిన భారతీయుడు 2 సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.

పలు కారణాలవల్ల ఈ చిత్రం ఆగిపోగా ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోవడంతో మళ్లీ తిరిగి రూపొందించడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్న సమయంలో వారు ఇటీవలే ఆమెను సంప్రదించటం తన పాత్రను చేయాలని చెప్పడంతో ఆమె ఒప్పుకుందట. దాంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను వెల్లడించింది. మరి శంకర్ ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలుపెడతాడో అనేది చూడాలి. ఆయన తెలుగులో చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా ఈ మూడు చిత్రాలతో శంకర్ మళ్ళీ మంచి కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: