నేటి రోజుల్లో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరూ అంటే ముందుగా వినిపించే పేరు కృతి శెట్టి అనే చెప్పాలి. ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.  ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేందుకు కూడా సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ ఉండడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది అని చెప్పాలి. కేవలం నటన మాత్రమే కాదు డాన్సుల్లో కూడా ఇరగదీస్తుంది కృతి శెట్టి.


 ఇకపోతే నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి నటించింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తన పాత్ర గురించి చెబుతూ తన పాత్ర ఎంతో సింపుల్గా ఇన్నోసెంట్ గా ఉంటుందని సందర్భాన్ని బట్టి తన క్యారెక్టర్ మారుతూ ఉంటుందని సీక్రెట్ బయటపడింది కృతి శెట్టి.


 మీ జీవితంలో ఎలాంటి పాత్ర చేయాలని గోల్ పెట్టుకున్నారు అని ప్రశ్నించగా.. తనకు సినిమాలలో కాకుండా నిజ జీవితంలో ఒక ఎన్జీవో సంస్థను స్థాపించాలాన్నది తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇక ప్రస్తుతానికైతే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పేసింది ఈ అమ్మడు. ఇకపోతే  మొన్నటికి మొన్న రామ్ సరసన నటించిన ది వారియర్ సినిమాలో ఈ అమ్మడి అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ సినిమా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.  ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం తో అయినా సూపర్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: