ఇప్పుడు మనం అందరం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి బాహుబలి, బజరంగీ భాయ్ జాన్ మరియు #RRR వంటి సినిమాలను ఈరోజు మనం చూసి ఆనందిస్తున్నాము అంటే దానికి కారణం విజయేంద్ర ప్రసాద్ గారు.. అయితే ఈయన అందించిన అద్భుతమైన కథల వల్లే ఆ సినిమాలు ఆ స్థాయిలో సంచలన విజయాలు సాధించాయి..ఇక ఈ సినిమాలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి..ఇకపోతే ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరు మన భారత దేశ సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసాయి..అంతేకాదు ఇంతతి ఘన కీర్తి ప్రతిష్టలు మన ఇండియన్ సినిమాకి రప్పించేందుకు ప్రధాన పాత్ర వహించారు కాబట్టే విజయేంద్ర ప్రసాద్ గారిని రాజ్య సభ కి ఎంపిక చేసి..

 అరుదైన గౌరవం దక్కేలా చేసింది కేంద్ర ప్రభుత్వం..ఇదిలావుంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమా కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..అయితే ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం అని తెలుస్తుంది..ఇక ఈ ఏడాది లోపు సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది లో సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రయత్నిసున్నారట.ఇక ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేసినట్టు గత కొద్దీ రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ కథని తన కొడుకు రాజమౌళి దర్శకత్వం లో తియ్యించాలి అనేది విజయేంద్ర ప్రసాద్ కోరిక..

 అట..ఐకపోతే స్వతంత్రం రాకముందు ఆంగ్లేయుల పాలనలో సన్యాసుల తిరుగుబాటు నేపథ్యం లో ఈ కథ సాగుతుంది అట..కాగా బెంగాలీ లో వచ్చిన 'ఆనంద మటం' అనే నవలని ఆధారంగా తీసుకొని ఈ కథని ఎంతో గొప్ప గా రూపొందించారట విజయేంద్ర ప్రసాద్.. అయితే ఈ కథ ఆయన డ్రీం ప్రాజెక్ట్..ఇక విప్లవ భావాలున్న పవన్ కళ్యాణ్ వంటి హీరోలు మాత్రమే ఈ కథకి న్యాయం చెయ్యగలరు అనేది విజయేంద్ర ప్రసాద్ భావన..అంతేకాదు విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్ఫాన్ అనే విషయం మన అందరికి తెలిసిందే..ఇకపోతే బాహుబలి 2 ఇంటర్వెల్ సన్నివేశం ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొనే చేశాను అని గతం లో చాలా సార్లు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..కాగా పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ఉంది కాబట్టి ఈ కథని కూడా చాలా గొప్పగా తీర్చి దిద్ది ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు..అయితే ఇక  ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తాడా..లేదా వేరే డైరెక్టర్ తీస్తాడా అనేది ఇంకా ఖరారు కాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: