జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ కార్యక్రమం ప్రేక్షకులకు నవ్వులు పంచటమే  కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారు ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తూ  ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ఇటీవలి కాలంలో ఎన్నో జంటలకు పాపులారిటీ దక్కింది. ఒకప్పటి సుధీర్, రష్మి జంట దగ్గర నుంచి మొన్నటి ప్రవీణ్, పైమా జంట వరకు కూడా ఎంతో మంది  ఫేమస్ అయిన వారు ఉన్నారు. ఇలాంటి వారిలోనే సుజాత, రాకేష్ జంట కూడా హైలెట్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక వీరిద్దరూ ఇప్పటికే ఎన్నోసార్లు జబర్దస్త్ స్టేజ్ మీద ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తపరుచుకున్నారు.  కానీ అటు బుల్లితెర ప్రేక్షకులు మాత్రం అస్సలు నమ్మడం లేదు అని తెలుస్తోంది. షో రేటింగ్స్ కోసం ఇలాంటివి చాలానే చూశాము అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు కొంతమంది. బుల్లితెర ప్రేక్షకులు వీరిద్దరు నిజంగానే ప్రేమ లో ఉన్నారా లేకపోతే ఇది కూడా స్కిట్ లో భాగమేన అంటూ కామెంట్ చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నారు. అయితే రాకింగ్ రాకేష్ సుజాత నిజంగానే ప్రేమలో ఉన్నారు అనేది ఇటీవలే విడుదలైన ఒక ప్రోమోలో అర్థమవుతుంది.


 ఇటీవల తమ ప్రేమను బహిర్గతం చేశారు ఈ జబర్దస్త్ జంట. స్టేజ్ పైన ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకున్నారు. అందరి ముందు తమ ప్రేమను బయటపెట్టారు  అని చెప్పాలి. అంతటితో ఆగలేదు ఏకంగా ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఛానల్లో శ్రావణ సన్నిధి కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో సుజాత రాకేష్ పాల్గొన్నారు. ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ ప్రమోషన్ గురించి పుట్టిన ప్రేమ కాదు జీవితాంతం కలిసి ఉండే ప్రేమ అంటూ రాకేష్ చెప్పగా.. ముందుగా హగ్ ఇచ్చిన సుజాత  అతనికి ముద్దు ఇచ్చి పరవశించిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: