తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే చెన్నై నుండి వచ్చి మంచి సక్సెస్ సాధించిన వారిలో నటులు బ్రహ్మాజీ కూడా ఒకరిని చెప్పాలి. ఇక బ్రహ్మాజీ తో పాటుగా రవితేజ కృష్ణవంశీ కూడా చెన్నై నుంచి వచ్చి సక్సెస్ అయిన వారీ.. ఈ ముగ్గురు కూడా ఒకేసారి సినీ ఇండస్ట్రీకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే బ్రహ్మాజీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు అని చెప్పవచ్చు.  ఈయన ఎక్కువగా అన్నగా,  తమ్ముడిగా,  ఫ్రెండ్ గా , విలన్ పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం  పోలీస్ పాత్రలు,  కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పాలి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ తన కెరియర్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇక ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చి 28 సంవత్సరాలు అవుతోంది.  ఒక నటుడికి ఐఏఎస్ కి,  ఐపీఎస్ కి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నారు . నటులుగా మాకు మాత్రమే దక్కిన అదృష్టం ఇది అంటూ బ్రహ్మాజీ వెల్లడించారు. అయితే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అవకాశాలు రావు.. దానికి కూడా సమయం పడుతుంది. అలా ప్రయత్నించి.. అవకాశాలను అందుకొని మేము కూడా పైకి వచ్చాము. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది.. సక్సెస్ అవ్వడం అన్నది అంతా సులభం కాదు అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

అయితే నాకు మొదటి ఛాన్స్ ఇచ్చింది మాత్రం కృష్ణవంశీ.. వాడు భవిష్యత్తు డైరెక్టర్ అవుతాడని నన్ను పెట్టుకుంటే నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పెద్ద డైరెక్టర్ అవుతావని వంశీని బెదరగొట్టేవాడిని అంటూ బ్రహ్మాజీ తెలిపారు. తనది లవ్ మ్యారేజ్ అని బెంగాల్  కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను అంటూ బ్రహ్మాజీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: