హీరోయిన్ రాసి కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. శుభాకాంక్షలు,పెళ్లి పందిరి, మనసిచ్చి చూడు, గోకులంలో సీత లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అందరికీ దగ్గరయింది. ఇక ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. అంతేకాదు తన అందాల ఆరబోతతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు ఐటంసాంగ్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.


 అంతేకాదండోయ్ నిజం లాంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కూడా నటించి తన నటనతో మెప్పించింది. అయితే ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించ గలిగిన  రాసి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమాను మాత్రం రిజెక్ట్ చేసిందట. ఇంతకీ రంగస్థలం లో రాసి రిజెక్ట్ చేసిన పాత్ర ఏదో కాదు జబర్దస్త్ యాంకర్ అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర. ముందుగా ఈ పాత్ర కోసం రాసిని అనుకున్నారట దర్శకుడు సుకుమార్.


 అయితే ఈ పాత్రలో మోకాళ్లపైకి చీర కట్టుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు మందు తాగే సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అయితే కథ రాసికి నచ్చినప్పటికీ ఇక తన పాత్రలో ఉన్న కొన్ని సీన్స్ మాత్రం ఆమెకు నచ్చలేదట. దీంతో ఆ పాత్రకి నో చెప్పిందట రాసి. ఇటీవలే ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. మోకాళ్లపై తొడలు కనిపించేలా చీర కట్టుకోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. పెద్ద సినిమా అయినప్పటికీ ఇలాంటి పాత్రలలో నన్ను చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇష్టపడరు. అందుకే నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాసి రిజక్ట్ చేయడంతో ఈ సువర్ణావకాశం అనసూయ తలుపు తట్టింది. చివరికి అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది రంగస్థలం సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: