లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం భారతీయుడు అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , అదిరిపోయే కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. అలాగే ఈ సినిమా కమల్ హాసన్ కు , శంకర్ కు అద్భుతమైన పేరు ప్రతిష్టలను తీసుకువచ్చింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.

మూవీ కి ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలకపాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో భారతీయుడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ కా దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ ని కొంత కాలం క్రితం ప్రారంభించాడు. ఇండియన్ 2 మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని ప్రారంభించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియన్  2 మూవీ షూటింగ్ ఆగిపోయింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో శంకర్ , రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ ని ప్రారంభించాడు. మళ్లీ శంకర్ తిరిగి ఇండియన్ 2 మూవీ ని తిరిగి ప్రారంభించాడు. ఇది ఇలా ఉంటే రేపటి నుండి ఇండియన్ 2 కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ తాజా షెడ్యూల్ లో కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్ లకు సంబంధించిన షూటింగ్ ని ఇండియన్ 2 మూవీ యూనిట్ పున ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ మూవీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: