మన దేశంలో హిందూ పురాణాల ప్రకారం.. మన వాళ్ళకు భక్తి కాస్త ఎక్కువే.. ఆ సెంటిమెంట్ తో ఎక్కువ సినిమాల ను తెరకెక్కిస్తున్నారు. చరిత్ర చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ నుండి కార్తికేయ 2 వరకు పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వరుస లోనే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” కూడా వస్తుంది. హిందూ పురాణాల్లో ప్రథమం గా చెప్పే రామాయణ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తునుండ గా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి గా కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్‌ తో తెరకెక్కిస్తున్నా ఈ చిత్రం యొక్క టీజర్‌ను దసరా సందర్భంగా విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ చేయడాని కి 'అయోధ్య' కంటే బెటర్ ప్లేస్ లేదని చిత్ర యూనిట్ భావిస్తుంది. అక్కడ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని చిత్రబృందం భావిస్తుంది..ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కాబోతున్నట్టు, ఆయన చేతులు మీదగా మూవీ టీజర్ విడుదల చేయించబోతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమా హిట్ అయితే మాత్రం బాలివుడ్ లో డార్లింగ్ కు తిరుగు ఉండదు. బాహుబలి తర్వాత ప్రెక్షకుల ముందుకు వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆశించిన ఫలితాలను అందుకో లేకపోయాయి.. మరి ఈ సినిమా అన్నా హిట్ అవుతుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: