టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న మహేష్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు గౌతం సితార ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక గౌతమ్ ప్రస్తుతం పై చదువు లు చదువుతుండగా సితార మాత్రం ఒక వైపు చదువు కొనసాగిస్తూ నే మరోవైపు తన తండ్రితో కలిసి పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారట.


ఇక సితార ఇంత చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేకమై న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. మహేష్ బాబుకు సైతం తన కుమార్తె అంటే అమితమైన ప్రేమ అనే సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా డాటర్స్ డే సందర్భంగా మహేష్ బాబు తన కూతురి తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన కూతురికి స్పెషల్ విషెస్ తెలియజేశారు.


 


ఈ సందర్భంగా మహేష్ బాబు తన కూతురు గురించి చెబుతూ.. నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచే నా చిన్నారికి డాటర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా ఈయన తన కూతురికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


 


ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ బిజీగా మారిపోయారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారట.ఈ సినిమా ఎవరికీ తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ తో రాబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: