పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశారు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన విషయం తెలిసిందే.


 ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు.. ఫ్యామిలీ ముఖ్యం అంటూ బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ ని ఉద్దేశించి పబ్లిక్ గా షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు.


 

ఆ తర్వాత పూరి జగన్నాధ్ పరోక్షంగా బండ్ల కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడం చూశాం. నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలని పూరి హెచ్చరించారు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ పూరి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ పూరి జగన్నాధ్ గురించి ప్రస్తావన వచ్చిందట..


 

సదరు యాంకర్ బండ్ల గణేష్ తో ఎక్కువగా వివాదాస్పద అంశాల గురించే ప్రస్తావించే ప్రయత్నం చేశారు. దీనితో బండ్ల గణేష్ యాంకర్ పై శకునిలాగా వ్యవహరించవద్దు అంటూ చిర్రుబుర్రులాడారు కూడా . యాంకర్ పూరి జగన్నాధ్ గురించి అలా ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించగా.. భార్యని ప్రేమించని వాడు మనీషా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు.


 

ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే ఇది. పూర్తి ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఇంకెన్ని కామెంట్స్ చేశాడో చూడాలి. ఆయన ఫ్యామిలీ ఆయన ఇష్టం అని యాంకర్ అనగా.. పూరి గురించి కామెంట్స్ చేసే రైట్ నాకు ఉంది. పూరి నా ఫ్రెండ్ అంటూ బండ్ల గణేష్ యాంకర్ తో వాగ్వాదం చేశారట..


 

పూరి జగన్నాధ్, బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ రెండు చిత్రాలు వచ్చాయి. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇటీవల నిర్మాతగా సైలెంట్ అయ్యాడు.


 

ఇటీవల బండ్ల గణేష్ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మైక్ పట్టుకుంటే పూనకం తో ఊగిపోయే బండ్ల గణేష్ ని చూస్తూనే ఉన్నాం. కంప్లీట్ ఇంటర్వ్యూలో పూరి ఫ్యామిలీ గురించి బండ్ల గణేష్ ఇంకెన్ని కామెంట్స్ చేశాడో అంటూ నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: