దసరానాడు విడుదలకాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీపై మెగా అభిమానులు రోజురోజుకు అంచనాలు పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రేక్షకులు ‘గాడ్ ఫాదర్’ మూవీని దాని మాతృక ‘లూసీఫర్’ మూవీని ఒకటికి రెండుసార్లు లోతుగా విశ్లేషణలు చేస్తున్నారు. మోహన్ లాల్ స్థాయిలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో రాణించగలడా అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న కామెంట్స్ పరోక్షంగా ‘గాడ్ ఫాదర్’ మూవీ పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.


మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో ‘గాడ్ ఫాదర్’ ఒక క్లాసిక్ మూవీగా పరిగణిస్తారు. దీనికితోడు ఈమూవీలో మోహన్ లాల్ నటవిశ్వరూపం కనిపిస్తుంది. వాస్తవానికి ‘లూసీఫర్’ మూవీలో మోహన్ లాల్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో కేవలం 20 నిముషాలు మాత్రమే కనిపించి ఆతరువాత అతడి పాత్ర సెకండ్ హాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది. అయితే అలాంటి సాహసం ‘గాడ్ ఫాదర్’ మూవీలో చేసే ఆస్కారం లేదు.


సినిమా మొదలయ్యాకా చిరంజీవి కనిపించడం 10 నిముషాలు ఆలస్యం అయినా అభిమానులు ఊరుకోరు. దీనితో ఈమూవీ కథలో అనేక మార్పులు చేసి చిరంజీవిని విపరీతంగా ఎలివేట్ చేసారు. దీనికితోడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను టార్గెట్ చేస్తూ ‘గాడ్ ఫాదర్’ మూవీలో అనేక పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇలాంటి మాస్ డైలాగ్స్ ‘లూసీఫర్’ మూవీలో కనిపించవు.


దీనికితోడు ‘లూసీఫర్’ మూవీలో విలన్ గా నటించిన వివేక్ ఒబ్రాయ్ చాల స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తాడు. అలాంటి స్టైలిష్ నటన ఎంతవరకు సత్యదేవ్ లో కనిపిస్తుంది అని సందేహాలు వ్యక్తపరుస్తున్న వారు కూడ ఉన్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో మోహన్ లాల్ చిరంజీవిల నటనను పోలుస్తూ అనేక కామెంట్స్ సెటైర్లు కూడ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒక సినిమా విడుదల అయిందంటే చాలు ఆసినిమాను రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ కామెంట్స్ చేసే సోషల్ మీడియా విమర్శలు పెరిగిన ఈరోజులలో ఇన్ని విమర్శలు తట్టుకుని ఎంతవరకు ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బష్టర్ అవుతుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..







 

మరింత సమాచారం తెలుసుకోండి: