తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే నాని ఈ సంవత్సరం ఇప్పటికే అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని 'దసరా' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణమూవీ లో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో నాని అదిరిపోయే రేంజ్ ఉర మాస్ లుక్ లో కనిపించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దసరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. దసరా మూవీ నుండి 'ధూమ్ ధామ్ దోస్తాన్'  అనే మొదటి సాంగ్ ని 3 అక్టోబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నాని ఒంటి నిండా దుమ్ముతో ఉర మాస్ లుక్ లో ఉన్నాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: