టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "హరిహర వీరమల్లు". ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం.. మరో నిర్మాత ఏ. దయాకర్ రావుతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య కాలంలో జరిగిన కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం చిత్ర బృందం శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ విషయంలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వాటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం శుక్రవారం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కు సంబంధించిన వీడియోని విడుదల చేసి క్లారిటీ ఇచ్చేసింది.


తదుపరి షెడ్యూల్ లో పాల్గొనే ప్రధాన నటీనటులతో పాటు కొంత మంది సాంకేతిక నిపుణులతో ప్రీ షెడ్యూట్ వర్క్ షాప్ ని నిర్వహించారు.మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో నటీనటులు సాంకేతిక నిపుణులు వర్క్ షాప్ లో పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఉదయం ఝామున సరస్వతీ అమ్మవారికి పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం చిత్ర బృందం ఈ వర్క్ షాప్ ని నిర్వహించారట.ఈ వర్క్ షాప్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లుక్ తొలి ప్రేమ నాటి రోజుల్ని గుర్తు చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త లుక్ టెర్రిఫిక్ గా ఉంది.మళ్లీ అంత యంగ్ గా పవన్ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆయన లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ మూవీని పవన్ కెరీర్లోనే నిలిచిపోయే మూవీగా చెయ్యాలని చిత్ర బృందం బాగా చెక్కుతున్నారట. అన్ని విధాలుగా ఈ మూవీ ఆకట్టుకోవడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: