తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక హైపర్ అది వేసే పంచుల గురించి ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు.


ఏ షో అయినా కూడా షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై కూడా వరుసగా పంచులు వేస్తూ కడుపుబ్బనవిస్తూ ఉంటాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు హైపర్ ఆది హద్దులు దాటి మరి సెటైర్స్ వేస్తుంటాడు. అయితే ఆది తోటి ఆర్టిస్టులు కమెడియన్ల వరకు ఒకే కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్దపెద్ద సెలబ్రిటీలపై కూడా పంచులు వేస్తూ ఉంటాడట.. కాగా ఇప్పటికే రోజా, ఇంద్రజ వంటి హీరోయిన్లపై కూడా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.


కేవలం వీరు మాత్రమే కాకుండా కృష్ణ భగవాన్, సింగర్ మనో, అలాగే అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంట్రీ ఇచ్చే స్పెషల్ గెస్ట్ లపై కూడా ఇష్టం వచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ సెటైర్లు వేస్తూ రెచ్చిపోతుంటాడట.. రాను రాను హైపర్ ఆది కౌంటర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. మంగమ్మగారి కొడుకు అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ నీ చేశారు. కాగా ఈ ఎపిసోడ్ లో సీనియర్ నటి హేమ, భర్తగా హైపర్ ఆది నటించగా వారిద్దరి కొడుకుగా నరేష్ కనిపించాడట.


  అయితే అవకాశం దొరికింది కదా అని హైపర్ ఆది హేమపై వరుసగా పంచులు వేశాడు. నరేష్ అన్నం తినకుండా అల్లరి చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి హేమ వచ్చి అన్నం తిను నాన్న అని బుజ్జగిస్తూ ఉంటుందట.. అప్పుడు హైపర్ ఆది ఏంట్రా మీ అమ్మ 70 ఏళ్లు వచ్చినా ఇంకా ఆ గౌన్లు వేసుకోవడం మానేయలేదు అంటూ కౌంటర్ వేశాడు. అలా కౌంటర్ వేయడంతో నరేష్ తలదించుకోగా హేమ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ హేమ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది. దీంతో హైపర్ ఆది పై నెటిజన్స్ దారుణంగా విడుచుకుపడుతున్నారు. హైపర్ ఆదికి అతి ఎక్కువ అయ్యిందా? షో కి గెస్ట్ గా ఎవరు వచ్చినా వారిపై సెటైర్స్ వేయడమే హైపర్ ఆది పనినా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పై సోషల్ మీడియాలో నెగటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ హైపర్ ఆది మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో వరుసగా పంచులు వేస్తున్నాడు. కొంతమంది నెటిజన్స్ హైపర్ ఆది తోటి ఆర్టిస్టులపై పంచులు వేయడం బాగానే ఉంది కానీ సెలబ్రిటీలపై పంచులు వేయడం ఏమీ బాగోలేదు అని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: