టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించ బోతున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అయినటు వంటి సోనాల్ చౌహాన్ కథానాయకగా నటించింది. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. 

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను కూడా విడుదల చేయగా ,  వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ది ఘోస్ట్ మూవీ నుండి 'దూరాలైన తీరాలైన'  అనే రాప్ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ది ఘోస్ట్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: