అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18 న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నత విద్యను అభ్యసించింది. తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది.

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. 'ఆ ఆ', 'శతమానంభవతి', 'ఉన్నది ఒకటే జిందగీ' లాంటి సూపర్ హిట్స్ లో నటించిన అనుపమ, ఈ మధ్యే 'కార్తికేయ 2 ' తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ సినిమా హిందీ లో కూడా సూపర్ హిట్ అవ్వడంతో అనుపమ కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ బాగా వస్తున్నాయి. బాలీవుడ్ లో సినిమాలు లేక చాలామంది నార్త్ హీరోయిన్స్ సౌత్ కి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ వచ్చిన రెమ్యూనరేషన్ లో సగం ఇచ్చినా బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికి రెడీ అయిపోతారు.

కానీ, అనుపమ రివర్స్ లో ఉంది. అనుపమ మాత్రం బాలీవుడ్ సినిమాలో చేయకూడదని నిర్ణయించుకుందట. అంతేకాదు సౌత్ హీరోయిన్స్ ని నార్త్ లో చాలా చులకనగా చూస్తారని.. సౌత్ లో ఉన్నప్పుడు ఆ క్రేజ్ కోసం నార్త్ కి తీసుకెళ్తారని.. ఒక్క సినిమా కాని అక్కడ ఫ్లాప్ అయితే ఐటమ్ గర్ల్ గా చూస్తారంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసిందట . అందుకే తన వద్దకు వస్తున్న బాలీవుడ్ సినిమాలన్నీ రిజెక్ట్ చేస్తున్నానని తెలిపిన అనుపమ.

మరింత సమాచారం తెలుసుకోండి: