పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హన్సిక మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైన చిత్రం దేశముదురు. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాలను సృష్టించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవల హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. ఇండస్ట్రీలో తనకు అవకాశం రావడానికి కారణం మెహర్ రమేష్ అని స్పష్టం చేసింది. ఇక దేశముదురు మూవీ షూటింగ్ సమయంలో నా పదహారో పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టినరోజు వేడుకలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇక బన్నీ , పూరీ జగన్నాథ్ నా పుట్టినరోజు వేడుకలు పబ్ లో చేయించారు.. వారు నాతో చేయించిన ఆ పని ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా తెలిపింది. ఇక పూరీ జగన్నాథ్ బన్నీ పబ్బులో నాతో వేడి పాలు తాగించారు. అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. ఇక ఆ సమయంలో బన్నీ ఇచ్చిన గిఫ్ట్ ఎంతో ఫన్నీగా ఉందని కూడా హన్సిక వెల్లడించారు.. ఇక బన్నీ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ నాతో అలాగే ఉంది.. ఆ పుట్టినరోజు వేడుక నాకు ఒక స్వీట్ మెమోరీ అని కూడా ఆమె తెలిపింది.. ఇక ఒక డైలాగు చెప్పలేక నేను ఇబ్బంది పడుతుంటే బన్నీ నా పక్కనుండి తెగ నవ్వించేవారు..

ఇక హిమేష్ రేష్మియా తో హిందీలో నా తొలి సినిమా చేశాను అంటూ తెలిపింది. ఇక వరుసగా బెస్ట్ డాన్సర్ లైన హీరోలతో కెరియర్ తొలినాళ్ళల్లో నటించాను అని కూడా హన్సిక తెలిపింది. ఇక కంత్రి సినిమాలో తారక్ తో కలిసి నటించానని.. తారక్ మనిషి అని , మంచి డాన్సర్ అని కూడా హన్సిక తెలిపింది. ఇక నేను బేసిక్ గా హార్డ్ వర్క్ అంటే ఇష్టపడతాను. హార్డ్ వర్క్ లో కొంచెం తేడా ఉండవచ్చు తప్పా..బాలీవుడ్, టాలీవుడ్ అనే విషయంలో సేమ్ అంటూ హన్సిక కామెంట్లు చేశారు. ప్రస్తుతం హన్సిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: