అదేమిటి రామ్ చరణ్ తేజ్ మాట తప్పడం ఏమిటి?
అనుకుంటున్నారా అవును నిజమే మీరు విన్నది కరెక్టే. రామ్ చరణ్ తేజ మాట తప్పారు. అసలు విషయం ఏమిటంటే గతంలో ఒక బ్రాండ్ ప్రమోషన్ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో గాని మీడియాలో గాని స్వయంగా ప్రొడక్షన్ హౌస్ లు ప్రకటించడాన్ని రామ్ చరణ్ తప్పుపట్టారు.

అలా చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్న ఆయన తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ సంస్థ కానీ ఏదో తాను హీరోగా నటిస్తున్న సంస్థల నుంచి గాని ఇలాంటి విషయాలలో అధికారిక ప్రకటన రాకుండా చూసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఇలా నంబర్స్ షేర్ చేయడం వల్ల లేనిపోని కాంట్రావర్సీలు అవుతాయని అన్నారు. ఇకమీదట దాన్ని తాను శిరసావహిస్తానని ఆయన అన్నారు. కానీ తాజాగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది అంటే కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు అప్పట్లో రామ్ చరణ్ మాట్లాడిన వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. రాంచరణ్ మాట మీద నిలబడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రాంచరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు కూడా పలు సందర్భాల్లో రామ్ చరణ్ అభిమానులను, రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ విషయంలో రామ్ చరణ్ ను వెనకేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోసారి చెప్పిన మాటలు ఫాలో అవ్వలేకపోవచ్చని అంతమాత్రానికే మాట తప్పారంటూ మాటలు తూలడం కరెక్ట్ కాదని వారు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: