నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో శృతి హాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది . దునియా విజయ్మూవీ లో విలన్ గా కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు .

మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది . ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

2024 ఎలక్షన్స్ ముందు బాలయ్య పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా చేయాలని భావిస్తున్నట్లు , అందుకు దర్శకుడు బోయపాటే కరెక్ట్ అని బాలకృష్ణ అనుకున్నట్టు తెలుస్తుంది.  దానితో 2023 వ సంవత్సరంలో బాలకృష్ణ ,  బోయపాటి కాంబినేషన్ లో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కబోతున్నట్లు ,  దానిని 2024 వ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: