మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఈ సినిమా ఘన విజయం అవడంతో ఈయన క్రేజ్ పాన్ ఇండియాను సైతం దాటి హాలీవుడ్  కూడా చేరిపోయింది.

ఇక ఇప్పుడు చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.

మెగా ఫ్యాన్స్ కూడా RC15 సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు. ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.. మిగిలిన షూట్ స్టార్ట్ చేయకముందు కొంత కాలం ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చారు అంటా మరి.

నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అని టాక్. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఈ సినిమాలో చరణ్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో మరో కొత్త లుక్ లోకి చరణ్ మారిపోయాడు. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పిక్ షేర్ చేసాడు. ఈ పిక్ లో చరణ్ లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు. మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ ఫొటోలో మరొక దృశ్యం కూడా బాగా ఆకట్టు కుంటుంది. చరణ్ ఎంతగానో ఇష్టపడే తన పెట్ రైమ్ తో దిగిన ఫోటో షేర్ చేసాడు.. ఈ ఫోటోలో చరణ్ తన జాకెట్ లో పెట్టుకుని మరీ తన పెట్ తో ఫోటో దిగాడు.. ఈ బ్యూటిఫుల్ ఫోటో అందరినీ బాగా ఆకట్టు కుంటుంది.. ఇక త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం చరణ్ ఈ లుక్ లోకి మారినట్టు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: