అయితే ఇప్పుడు ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు ఇద్దరూ కూడా ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఎంతో మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుంటారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఏ ఒక్కరూ కూడా ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. రాజమౌళి అయితే తన ఇద్దరు హీరోలను సమానంగానే చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం జపాన్‌లో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. అయితే అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్, యాక్టర్ ఎవరు అని అక్కడి మీడియా ప్రశ్నించింది. అయితే దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. రామ్ చరణ్ నాన్న చిరంజీవి గారు ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు చిరంజీవి ఎవరు? అని అడిగిన ఎన్టీఆర్.. ఇప్పుడు అదే చిరంజీవి గురించి ఇలా చెప్పేశాడు. అయినా కాలం మనిషిలో ఎంతో మార్పును తీసుకొస్తుంటుందనే దానికి ఇదే ఉదాహరణ. ఒకప్పుడు చరణ్ కూడా ఎంతో అగ్రెసివ్, యాటిట్యూడ్‌తో ఉండేవాడు. కానీ ఇప్పుడు అతనిలోనూ ఎంతో మార్పు వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి