చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ మూవీకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ‘వేర్ ఈజ్ ద పార్టీ’ కి సంబంధించిన లిరికల్ వీడియోకు చిరంజీవి అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. 68 సంవత్సరాల వయసులో చిరంజీవి మాస్ లుక్ తో రెచ్చి పోయి వేసిన స్టెప్స్ ను చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు.


ఈ లిరికల్ వీడియో విడుదలై రెండు రోజులు కూడ అవ్వకుండానే ఈ లిరికల్ వీడియో కాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఒరిజినల్ గా అనిపిస్తున్నప్పటికీ ఈపాట చిత్రీకరణలో అనుసరించిన విధానం 14 సంవత్సరాల క్రితం తమిళ హీరో శింభు నటించిన ‘సిలంబట్టం’ మూవీలోని మాస్ సాంగ్ ను పోలి ఉంది అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఆమూవీ తెలుగులో చాల సంవత్సరాల క్రితం ‘మా వాడు’ మూవీగా తెలుగులో డబ్ అయింది అని కూడ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఆ పాటలో కూడ ఇలాగే ఒక లేడీ సింగర్ తో ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అన్న శబ్దం వినిపిస్తుందని ఆ శబ్దాన్ని దేవిశ్రీ ప్రసాద్ మక్కీకి మక్కీగా కాపీ కొట్టాడు అంటూ మరికొందరు విమర్శకుల వాదన. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ మెగా అభిమానులు పట్టించుకునే స్థితిలో లేరు.


బాస్ పార్టీ సాంగ్ ‘వాల్టేర్ వీరయ్య’ కు కాసుల వర్షం కురిపిస్తుందని మెగా అభిమానుల అంచనా. ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ సినిమాలు చిరంజీవికి రికార్డులు క్రియేట్ చేయలేకపోవడంతో ఆలోటును ‘వాల్టేర్ వీరయ్య’ తీరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవిని అతడి అభిమానులు ఎలాంటి మాస్ లుక్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి లుక్ లో చిరంజీవి ఈమూవీలో కనిపిస్తూ ఉండటంతో ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. చిరు మ్యానియాకు మాస్ మహారాజ క్రేజ్ కూడ తోడవ్వడం ఈ మూవీకి మరింత ప్లస్ పాయింట్..    


మరింత సమాచారం తెలుసుకోండి: