మాస్ మహారాజా రవితేజ తాజాగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ధమాకా మూవీ ని అభిషేక్ అగర్వాల్ ,  టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతం అందించగా , కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో  విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ధమాకా మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పాటలకు మరియు ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ "డు డు" అనే  లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. మరి ధమాకా మూవీ తో అయిన రవితేజ ప్రేక్షకులను అలరిస్తాడో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే రవితేజ అభిమానులు ధమాకా మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: