దేశావ్యాప్తంగా కాంతార సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించింది ఈ సినిమా.. సుమారు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సూపర్ పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది.కన్నడ డైరెక్టర్  రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా బాగా సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతోన్న కాంతారకు మూవీకి సంబంధించి ఓ వార్త అభిమానులను  ఎంతగానో నిరాశపరించింది. ఈ చిత్రానికి బాగా హైలెట్‌గా నిలిచిన ‘వరాహ రూపం’ పాటను ఓటీటీలో తొలగించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి హైలైట్ అంటే వరాహరూపం పాట అనే చెప్పాలి. ఇంకా అలాగే క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన. 


చివరి 20 నిముషాలు ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్ అంచున కూర్చోబెడుతుంది కాంతార సినిమా. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రానికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో కాంతార సినిమా చూసే ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది.వరాహ రూపం పాటను యాడ్ చేశారు. ఓటీటీలో ఆ పాట స్థానంలో వేరొక ట్యూన్ ని యాడ్ చేశారు. కానీ ఒరిజనల్ తో పోల్చుకుంటే ఈ పాట ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో వరాహ రూపం పాట కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చెయ్యగా దాంతో వరాహ రూపం సాంగ్ ను యాడ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు రాబట్టి అన్ని భాషల్లో బ్లాక్  బస్టర్  హిట్  అయ్యి కన్నడలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రస్తుతం కన్నడలో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు.నిజానికి యష్  KGF తో అంత పెద్ద హిట్  కొట్టినా కూడా ప్రస్తుతం రిషబ్  శెట్టి పేరు మారు మొగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: