పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఎంతలా అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.


 ఈ టీజర్ ఊహకందని రీతిలో ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఈ టీజర్ లో విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఏకంగా ప్రభాస్ తో సినిమా తీసినట్లు లేదని బొమ్మల సినిమా చూసినట్లు ఉంది అని కొంతమంది విమర్శలు చేశారు. ఇక ఈ టీజర్ తో అటు ప్రభాస్ అభిమానుల సైతం నిరాశలో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న డైరెక్టర్ ఓం రౌత్ ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఇదిలా ఉంటే ఇటీవలే ఒక అభిమాని ఏకంగా ఆదిపురుష్ టీజర్ లో ప్రభాస్ నీటి లోపల కూర్చుని ధ్యానం చేస్తున్న ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసి అదుర్స్ అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగచక్కర్లు కొడుతుంది. త్రీడీలో ఈ సీన్ ను ఎలా రీ క్రియేట్ చేశాడు అన్న విషయాన్ని కూడా చూపించాడు సదరు అభిమాని. దీంతో ఇది చూసిన ఎంతోమంది అభిమానులు 500 కోట్లతో తీసిన ఆది పురుష్ కంటే ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: