సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి , భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి పరశురామ్ దర్శకత్వం వహించగా , మహానటి కీర్తి సురేష్మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. సముద్ర కని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , తమన్మూవీ కి సంగీతం అందించాడు.

ఇలా థియేటర్ లలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇలా థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 9.45 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెండవ సారి బుల్లి తెర పై ప్రసారం అయింది. రెండవ సారి సర్కారు వారి పాట బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 6.80 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. ఇలా రెండవ సారి కూడా సర్కారు వారి పాట బుల్లి తెర పై అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: