టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సమంత నాగచైతన్య ఇద్దరు వారి విడాకులు అనంతరం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు .ఇదిలా ఉంటే ఇక సమంత మరియు నాగచైతన్ మధ్య పెరిగిన దూరం ఫ్యామిలీని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేసినట్టుగా లేదు. ఎందుకంటే సమంత కోసం సుమంత్ సుశాంత్ అఖిల్ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఇలా అందరూ ఆమెకి తోడుగా ఉన్నారు. అంతేకాదు ఆమె తన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా వారు కామెంట్లు పెడుతూ ఉండడం మనం చూస్తుంటాం .

ఇదిలా ఉంటే ఇక తాజాగా సురేష్ బాబు అల్లు అరవింద్ కలిసి బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు వచ్చిన సంగతి తెలిసిందే కదా .ఇక ఈ షోలో భాగంగా బాలకృష్ణ సురేష్ బాబును కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అదేంటంటే ఈతరం హీరోయిన్ లలో మహానటి రేంజ్ కు వెళ్లగల స్థాయి ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగారు..అందుకు సురేష్ బాబు సమంత పేరు చెప్పడం జరిగింది ..పేరు చెప్పడమే కాకుండా సమంత గురించి అనేక విషయాలను వెల్లడించి ఆమె గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న హీరోయిన్ లలో  సమంత మాత్రమే మహానటి అవ్వగలదు అని సురేష్ బాబు చెప్పడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీంతో సమంత అభిమానులు అంతా మహానటి సమంత అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ఇప్పుడు సమంత మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకుగాను సమంత ఇంటికే పరిమితమైంది.. అయితే సమంత కొన్ని ప్రాజెక్టులను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది ఈ వ్యాధి కారణంగా సమంత చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అంతేకాదు సమంత మయోసైటిస్ తో బాధపడుతూ ఉండడంతో ఇటీవల ఆమె నటించిన యశోద ప్రమోషన్స్ ను కూడా చేయలేకపోయింది .అంతేకాదు విజయ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.ఆమె నటించిన శాకుంతలం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు.. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మరియు ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: