తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ "పెళ్లి చూపులు" మూవీ తో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం ,  టాక్సీవాలా లాంటి విజయవంత మైన మూవీ లతో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన లైగర్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , రమ్యకృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ ఆకులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. డిసెంబర్ 11 న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సినిమా ప్రసారం కానుంది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: