సినిమా ఇండస్ట్రీ లోకి చాలా మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు  కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది హీరోయిన్ లు మాత్రమే అద్భుతమైన క్రేజ్ ను మరియు అద్భుతమైన విజయాన్ని మొదటి మూవీ తోనే దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీ నిధి శెట్టి ఒకరు. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీ తో వెండితెరకు పరిచయం అయింది. 

ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని , పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా కేజిఎఫ్ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా కోబ్రా మూవీ లో విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కేజిఎఫ్ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ నిధి శెట్టి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా శ్రీ నిధి శెట్టి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ నిధి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని అంతే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: