సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపు ను సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటారు. అలాంటి వారిలో శైలేష్ కొలను ఒకరు. ఈ దర్శకుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ తోనే శైలేష్ కొలను దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం తో , ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా శైలేష్ కొలను హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. అడవి శేషు హీరో గా తెరకెక్కిన ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా శైలేష్ కొలను క్రేజ్ మరింత గా పెరిగింది. త్వరలోనే ఈ దర్శకుడు నాని హీరోగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని రూపొందించబోతున్నాడు. ఈ మూవీ తో పాటు శైలేష్ కొలను మరో సీనియర్ స్టార్ హీరోతో మూవీ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ తో మూవీ చేయడానికి ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తహ తహ లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే హిట్ ది థర్డ్ కేస్ మూవీ లో నాచురల్ స్టార్ నాని తో పాటు అడవి శేషు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: